రామ్‌ గోపాల్‌ వర్మ ఓ జీనియస్‌: నటి

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ చాలా జీనియస్‌ అని ఓ నటి కితాబు ఇచ్చారు. ఆమె ఎవరో కాదు.. 2002లో వర్మ తెరకెక్కించిన ‘కంపెనీ’ సినిమాలో ‘కల్లాస్‌’ పాటలో కనిపించి పేరు తెచ్చుకున్న ఇషా కొప్పికర్‌. ప్రస్తుతం ఈ నటి వర్మ రూపొందిస్తున్న ఓ వెబ్‌ సిరీస్‌లో మళ్లీ కనిపించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.. రామ్‌ గోపాల్‌ వర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ్‌ గోపాల్‌ వర్మ ఒక మేధావి అని,  తన కెరీర్‌ పరంగా ప్రస్తుతం వర్మ బ్యాడ్‌ ఫేజ్‌లో ఉన్నప్పటికీ భారత సినిమా రంగానికి ఆయన చేసిన సహాకారం మరువలేనిది అన్నారు. (ఆ దర్శకుడితో విజయ్‌ నాలుగో సినిమా!)